సోన్, ఫిబ్రవరి 27 : “ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే నయా పైసా ఖర్చు లేకుండా ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికి డబుల్బెడ్రూం ఇండ్లను ఇస్తున్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి జాగా ఉండీ ఇల్లు కట్టుకునే వారికి పెట్టుబడి కింద డబ్బులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మీకు పెన్షన్లు రావట్టే.. రైతులకు రైతుబంధు, రైతుబీమా వస్తున్నది. మిషన్ భగీరథ కింద ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నాం. పిల్లలు చదువుకునేందుకు గురుకులాలను ఏర్పాటు చేశాం. ఇవన్నీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జీవితంలో మర్చిపోవద్దు” అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో రూ.2.50కోట్లతో నిర్మించిన 50 డబుల్బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికెళ్లి లబ్ధిదారులను ఆప్యాయంగా పలుకరిస్తూ ఇంటి పట్టా ఇచ్చి శాలువాతో సన్మానించారు. వారితో ఆనందాలను పంచుకున్నారు. శ్రీరాంసాగర్‌లో ముంపునకు గురైన రత్నాపూర్‌కాండ్లీ 40 ఏళ్ల కింద పునరావాస గ్రామంగా ఇక్కడ ఏర్పడిందని, దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలు కావడంతో దేశ ప్రజలందరూ ఇప్పుడు కేసీఆర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి దేశ రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. రత్నాపూర్ కాండ్లీ మీదుగా జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా మార్చేందుకు నిధులు మంజూరయ్యాయన్నారు. అనంతరం పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేయగా.. సానుకూలంగా స్పందించారు. నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నర్మదా ముత్యంరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్ మహేందర్‌రెడ్డి, మల్లేశ్ యాదవ్, దేవరకోట చైర్మన్ లింగంపల్లి లక్ష్మీనారాయణ, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ ఉమారెడ్డి, నిర్మల్ మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సాద విజయ్‌శేఖర్, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, నాయకులు పడకంటి రమేశ్‌రెడ్డి, కుంట పద్మాకర్, మల్లికార్జున్‌రెడ్డి, నారాయణ, మహేశ్‌రెడ్డి, అక్కాపూర్ పోశెట్టి, పాల్దె దేవేందర్, మచ్చు రవీందర్, తొడిశెట్టి శ్రీనివాస్, సురేందర్ పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 27: నిర్మల్ జిల్లాకు త్వరలోనే మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరు కానున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ కాలనీ సమీపంలో నిర్మించనున్న 250 పడకల జిల్లా దవాఖాన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో రూ.40 కోట్లతో 250 పడకల వైద్యశాల నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. మార్చి 3న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదాముత్యంరెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, నాయకులు రాంకిషన్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి, మారుగొండ రాము, గొనుగోపుల నర్సయ్య, జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 27 : రైతులు సంప్రదాయ పంటలను వదిలి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట ఉత్పత్తులు పెంపొందించేలా ఉద్యానవన, పట్టు పరిశ్రమలశాఖ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయ సముదాయంలో రూ.19 లక్షలతో నిర్మించిన జిల్లా పట్టు, ఉద్యానవనశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. రైతులు ఉద్యానవన పంటలు పండించాలని, పట్టు పరిశ్రమను నెలకొల్పాలని సూచించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు నర్మదా ముత్యంరెడ్డి, రవీందర్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ వెంకట్రాంరెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ తక్కెల రమణారెడ్డి, మాణిక్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి, రైతు బంధు సమితి నిర్మల్ మండల కన్వీనర్ మల్లేశ్, నర్సాపూర్ కన్వీనర్ నర్సారెడ్డి, జడ్పీటీసీ రామయ్య, ఎంపీపీలు మహిపాల్‌రెడ్డి, బాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి శ్యాంరావ్ రాథోడ్, నిర్మల్ జిల్లా ఉద్యానవనశాఖ అధికారి అలీమా ఫాతిమా, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము పాల్గొన్నారు.