జిల్లా వ్యాప్తంగా గురువారం దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. వర్తక, వ్యాపార దుకాణాల్లో లక్ష్మీపూజలు చేశారు. సాయంత్రం ఇండ్లు, దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన దీపాలు ఆకట్టుకున్నాయి.
పటాకుల మోతతో గ్రామాలు, పట్టణాలు సందడిగా మారాయి. బంధుమిత్రులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
-సిద్దిపేట జిల్లా నెట్వర్క్, నమస్తే తెలంగాణ,నవంబర్1