Samantha | మయోసైటిస్ నుంచి కోలుకున్న స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్లీ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. మళ్లీ ఇంతకముందు అంతా స్ట్రాంగ్ అయ్యేందుకు జిమ్‌లో వర్కవుట్స్ మొదలుపెట్టింది. తన తదుపరి ప్రాజెక్ట్స్ కోసం రెడీ అవుతోంది. మళ్లీ నార్మల్‌గా మారుతున్న సామ్‌ను చూసి ఆమె అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో సామ్ షేర్ చేసింది.
క్లిష్టమైన సమయంలో నాకు తోడుగా ఉండి.. నాలో స్ఫూర్తి నింపిన who is the gravity బ్యాండ్‌కు ముందుగా సమంత ధన్యావాదాలు చెప్పింది. సాధ్యమైనంత వరకు కఠినమైన డైట్ పాటించినంత మాత్రాన తగినంత బలం రాదని.. ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలని పేర్కొంది. దీంతోపాటు జిమ్‌లో పుల్ అప్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ పోస్టుపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆలియాభట్, దేవ్ మోహన్, సుస్మిత కొణిదెల, రుహానీ శర్మ, సోఫీ చౌదరి తదితరులు ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్లు పెట్టారు. వెంకటేశ్ కూతురు సుశ్రిత, సుశాంత్ కూడా సామ్ పోస్టుకు మద్దతు పలికారు.
అయితే టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి చేసిన కామెంట్ మాత్రం ఇప్పుడు వైరల్‌గా మారింది. నువ్వు రెండు చేతులతో చేస్తుంది.. నేను ఒక్క చేతితోనే చేస్తున్నాను.. నువ్వు ఫీలయితావు ఏమో అని వీడియో షేర్ చేయట్లేదు అని చమత్కరించింది. ఈ కామెంట్ ఇప్పుడు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది.
“Waltair Veerayya | మెగాస్టారా మజాకా.. రూ.200 కోట్ల క్లబ్లో వాల్తేరు వీరయ్య..!”
Uorfi Javed | నాకు ఎవరూ ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదు.. బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన