keerthy suresh | పలు వైవిధ్యమైన చిత్రాలతో ప్రతిభ గల హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. నాయిక ప్రధాన చిత్రాలతో పాటు స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలు చేస్తూ దక్షిణాదిలో స్టార్‌గా ఎదిగింది. ఈ అందాల తార పెండ్లి కుదిరిందనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిన్ననాటి స్నేహితుడు, కేరళకు చెందిన ఓ వ్యాపారవేత్తని కీర్తి వివాహం చేసుకోబోతున్నదని చెప్పుకుంటున్నారు. ఈ నాయిక గత కొన్నేండ్లుగా ఈ బిజినెస్‌మేన్‌తో ప్రేమలో ఉందట. వీరి పెండ్లి పెద్దల అంగీకారంతో జరగబోతున్నది. అయితే ప్రస్తుతం కీర్తి ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసిన తర్వాతనే వివాహం జరపాలని భావిస్తున్నారట.
ఈ విషయంపై ఈ తార ఇప్పటిదాకా స్పందించలేదు. తను ప్రేమ వివాహమే చేసుకుంటానని గతంలో కీర్తి తెలిపింది. ఆమె కెరీర్ చూస్తే కొన్ని అపజయాలు ఎదురైనా జోరు తగ్గడం లేదు. తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తున్నది. తెలుగులో చిరంజీవి సోదరిగా ‘భోళా శంకర్’, నానితో ‘దసరా’ సినిమాలతో పాటు తమిళంలో ‘మామన్నన్’, ‘రివాల్వర్ రీటా’, ‘రఘుతాథ’ వంటి చిత్రాలు చేస్తున్నది.