పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా దేశం కోసం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ మంగళవారం నల్లగొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని...
– జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ, అక్టోబర్ 27 : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా దేశం కోసం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ మంగళవారం నల్లగొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని ఎస్పీ శరత్ చంద్ర పవార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం 154 మంది, మన తెలంగాణలో నలుగురు పోలీసులు అమరులయ్యారని తెలిపారు. వారి త్యాగాలు చిరస్మరణీయమని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లు, ప్రమాదాలను ఎదుర్కొంటూ ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది సేవలు అభినందనీయమని తెలిపారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడం, పోలీసుల సేవలు, విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే సవాళ్లపై ప్రజల్లో అవగాహన కల్పించడం అని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ చట్టాలను గౌరవించాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణంలోని ఎన్.జి కళాశాల, రామగిరి, క్లాక్ టవర్ మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్, 12th బెటాలియన్ అడిషనల్ కమెండెంట్ నాగేశ్వర్రావు, నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్.ఐలు, ఎస్.ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

