Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి రాజమౌళి తాజాగా పంచుకున్న విషయాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. తన తదుపరి చిత్రాన్ని మరింత విస్తృతమైన కథాంశంతో రూపొందిస్తున్నారు. చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’గా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా కనిపించనున్నారు.
బ్రెజిల్ పర్యటన సందర్భంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ‘వారణాసి’ కథాంశం గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. ఈ సినిమా కేవలం కాలంలో వెనక్కి వెళ్లే కథ మాత్రమే కాదని, విభిన్న ప్రపంచాలు, కాలమానాల మధ్య సాగే సాహసయాత్రగా ఉంటుందని ఆయన వివరించారు. అంటార్కిటికాలోని మంచుకొండల నుంచి ఆఫ్రికా అడవుల వరకు, పవిత్ర నగరమైన వారణాసి నేపథ్యంలో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇందులో పురాణాలకు సంబంధించిన అంశాలు, భారీ ఆకారాల్లో ఉండే వింత జీవులు, అద్భుతమైన దృశ్యాలు కథలో భాగం కానున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
‘వారణాసి’లో భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యాధునిక విజువల్స్ ఉన్నప్పటికీ.. కథకు అసలైన బలం కుటుంబ భావోద్వేగాలేనని రాజమౌళి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధం, స్వచ్ఛమైన ప్రేమ ఈ కథను ముందుకు నడిపించే ప్రధాన అంశాలుగా నిలుస్తాయని ఆయన వెల్లడించారు. సినిమా ప్రపంచాన్ని మాటల్లో పూర్తిగా వివరించడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ప్రత్యేక దృశ్యాల ద్వారా ప్రేక్షకులకు ఆ ప్రపంచాన్ని పరిచయం చేసినట్లు రాజమౌళి పేర్కొన్నారు.. దీంతో ఈ చిత్రంలో మహేశ్ బాబు పాత్ర ఎలా ఉండబోతోంది? తండ్రీకొడుకుల అనుబంధం కథలో ఎలాంటి మలుపులకు కారణమవుతుంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
Saudi Arabia | దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ భారీ ఆఫర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

