Waltair Veerayya | మెగాస్టారా మజాకా.. రూ.200 కోట్ల క్లబ్లో వాల్తేరు వీరయ్య..!
మెగాస్టార్ ఎప్పుడెప్పుడు కంబ్యాక్ ఇస్తాడా అని మెగా అభిమానుల ఎదురు చూపులకు ఈ సంక్రాంతి వేదికైంది. వింటేజ్ చిరును చూసి అభిమానులు మురిసిపోతున్నారు. భారీ అంచనాల నడుమ జనవరి 13న ప్రేక్షకులు ముందుకు వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మొదటి రోజు నుండి వసూళ్ల ప్రభంజనం కొనసాగించింది.
Waltair Veerayya Movie | మెగాస్టార్ ఎప్పుడెప్పుడు కంబ్యాక్ ఇస్తాడా అని మెగా అభిమానుల ఎదురు చూపులకు ఈ సంక్రాంతి వేదికైంది. వింటేజ్ చిరును చూసి అభిమానులు మురిసిపోతున్నారు. భారీ అంచనాల నడుమ జనవరి 13న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మొదటి రోజు నుండి వసూళ్ల ప్రభంజనం కొనసాగించింది. రిలీజ్ రోజున కాస్త మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లలో మాత్రం జోరు తగ్గలేదు. మొదటి రోజు మొదలుకొని మూడు, నాలుగు రోజుల వరకు కూడా అన్ని థియేటర్లలో హౌజ్ ఫుల్బోర్డులు పడ్డారు. మెగాస్టార్ కంబ్యాక్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో వాల్తేరు వీరయ్యతో రుజువైంది. పోటీగా వీరసింహా, వారసుడు, తెగింపు వంటి పెద్ద పెద్ద సినిమాలున్నా.. యూత్ నుండి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అందరూ వాల్తేరుకే ఓటేశారు.
పదవ రోజు కూడా ఈ సినిమా దాదాపు రూ.7 కోట్ల షేర్ వరకు కలెక్షన్లు సాధించిందంటే మెగాస్టార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా మెగాస్టార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వాల్తేరు వీరయ్య పది రోజుల్లో రూ.200 కోట్ల గ్రాస్ వసూల్ చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. రీ ఎంట్రీ తర్వాత సైరా మాత్రమే ఈ ఫీట్‌ను అందుకుంది. అయితే సైరా సినిమా ఈ మార్క్ అందుకోవడానికి రెండు వారాలు పట్టింది. కానీ వాల్తేరు వీరయ్య కేవలం 10రోజుల్లో పైగా ఆ ఫీట్‌ను అందుకుంది. ఇదే జోరు కొనసాగితే సైరా ఫుల్ కలెక్షన్లను కూడా బ్రేక్ చేసే చాన్స్ ఉంది. ఇప్పటికే నిర్మాతలకు ఈ సినిమా వల్ల రూ.25 కోట్లకు పైగా ప్రాఫిట్స్ వచ్చాయి.
బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్మహరాజా రవితేజ కీలకపాత్ర పోషించాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ సగం సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు. చిరుకు జోడీగా శృతిహాసన్ నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు దేవీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. ఇక నిజానికి ఈ సినిమాకు వచ్చిన టాక్‌కు కలెక్షన్లకే ఏమాత్రం సంబంధంలేదు. దీన్ని బట్టి చూస్తే సంక్రాంతి కోసం స్టార్లు ఎందుకు పోటీ పడతారో ఇప్పుడు తెలుస్తుంది. ఒకవేళ వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రిలీజ్ కాకపోతే రిజల్ట్ కచ్చితంగా వేరేలా ఉండేది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

