Uorfi Javed | నాకు ఎవరూ ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదు.. బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన
Uorfi Javed | తన డ్రెస్సింగ్ విషయంలో ఇటీవల కేసులను కూడా ఎదుర్కొన్న ఉర్ఫీ జావెద్‌కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఆమెకు ముంబైలో ఎవరూ ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటూ విచారం వ్యక్తం చేసింది
Uorfi Javed | బిగ్‌బాస్ టీవీ షోతో గుర్తింపు తెచ్చుకుంది టీవీ నటి ఉర్ఫీ జావెద్. వచ్చిన పాపులారిటీని సరిగ్గా వాడుకోలేకపోయినప్పటికీ.. వివాదాస్పద వ్యాఖ్యలు, డ్రెస్సులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తన డ్రెస్సింగ్ విషయంలో ఇటీవల కేసులను కూడా ఎదుర్కొన్న ఉర్ఫీ జావెద్‌కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఆమెకు ముంబైలో ఎవరూ ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటూ విచారం వ్యక్తం చేసింది ఈ బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్.
‘ నేను వేసుకునే డ్రెస్సులు చూసి ముస్లిం ఓనర్లు ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదు. నేను ముస్లిం కాబట్టి హిందూ ఓనర్లు ఇల్లు రెంట్‌కి ఇవ్వడం లేదు. కొంతమందేమో నాకు వస్తున్న రాజకీయ బెదిరింపులను చూసి భయపడుతున్నారు. మొత్తానికి నాకు ముంబై నగరంలో అద్దెకు అపార్ట్మెంట్ దొరకడం చాలా కష్టంగా మారింది’ అంటూ ఉర్ఫీ జావెద్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. ఇది చూసిన ఓ నెటిజన్ నేను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నా.. మీకు త్వరలోనే ఇల్లు దొరకాలని ఆశిస్తున్నా అంటూ కామెంట్పెట్టాడు. దీనికి ఉర్ఫీ మళ్లీ స్పందించింది. అవును ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. నాలాంటి ముస్లిం, సింగిల్‌కు ఇల్లు దొరకడం ఎప్పుడూ అసాధ్యమే అంటూ రిప్లై ఇచ్చింది.
Read More :
Kangana Ranaut | కంగనా రనౌత్ బ్యాక్ టు ట్విట్టర్.. ఎమర్జెన్సీ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

