టాలీవుడ్ హీరోల్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ శర్వానంద్ (Sharwanand). ఈ యువ హీరో త్వరలోనే పెళ్లి (marriage) పీటలెక్కబోతున్నాడని ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకీ శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు ఫాలోవర్లు, అభిమానులు. అయితే అమ్మాయి గురించి ఆలోచిస్తున్న సినీ జనాల డైలమాకు చెక్ పెట్టే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
తాజా టాక్ ప్రకారం శర్వానంద్‌కు కాబోయే భార్య పేరు రక్షితా రెడ్డి. ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. రక్షిత తండ్రి మధుసూదన రెడ్డి హైకోర్టు లాయర్. టీడీపీ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అల్లుడు గంగారెడ్డికి మేనకోడలు అవుతుందని సమాచారం. శర్వానంద్-రక్షితారెడ్డి వెడ్డింగ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఉండబోతుందని తెలుస్తోంది.
మొదట చిన్న పాత్రలతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన శర్వానంద్.. ఆ తర్వాత హీరోగా సినీ ఇండస్ట్రీలో పదిహేనేళ్లకు పైగా సక్సెస్ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. కొత్తదనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. ముందుకెళ్తున్నాడు శర్వానంద్. ఈ టాలెంటెడ్ యాక్టర్ కొత్త సినిమా అప్డేట్ రావాల్సి ఉంది.