Sudheer Babu | రెండు పాత్రల్లో కనిపిస్తా.. హంట్ రిలీజయ్యాక ఆఫర్లు పక్కా: సుధీర్‌బాబు చిట్‌చాట్
మహేశ్ సూరపనేని (Mahesh Surapaneni) దర్శకత్వం వహిస్తున్న హంట్ జనవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో సుధీర్‌బాబు సినిమా విశేషాలు పంచుకున్నాడు.
టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (sudheerbabu) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ హంట్ (Hunt). మహేశ్ సూరపనేని (Mahesh Surapaneni) దర్శకత్వం వహిస్తున్నాడు. హంట్ జనవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో సుధీర్‌బాబు సినిమా విశేషాలు పంచుకున్నాడు. హంట్ సినిమా గురించి సుధీర్‌బాబు మాటల్లోనే..
హంట్ మూవీ గురించి..
ఈ సినిమాలో చాలా లీడ్ రోల్స్ ఉన్నాయి. ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ నిందితుడిలా అనుమానించేలా సాగుతుంది.
మీ పాత్ర ఎలా ఉండబోతుంది..?
అర్జున్ ఏ, అర్జున్ బీ పాత్రల్లో నటించా. అర్జున్ ఏ చాలా ధైర్యవంతుడైన పోలీసాఫీసర్. అర్జున్ బీ మెమోరీ లాస్ అయిన వ్యక్తి. అంటే అర్జున్ ఏకు పూర్తిగా భిన్నంగా ఉంటాడు. ఈ రెండు పాత్రలు పోషించడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా విడుదలైన తర్వాత నా ప్రయత్నాన్ని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తారని మాత్రం చెప్పగలను.
ఫైట్ సన్నివేశాలపై..
ప్రేక్షకులకు ఎంగేజింగ్‌గా అనిపించేలా ఫైట్స్ ఉండబోతున్నాయి. యాక్షన్ సీన్లలో చాలా కష్టపడ్డాం. ఓ స్పోర్ట్స్ పర్సన్‌గా రిస్కీ ఫైట్స్ చేయడం అంత కష్టమనిపించలేదు. మేకింగ్ వీడియో చూస్తే మేము ఎంతలా కష్టపడ్డామో తెలుస్తుంది. స్టంట్స్ కథలో భాగంగా వస్తాయి. ఎమోషన్స్ అందరినీ కదిలిస్తాయి. ప్రతీ యాక్షన్ సన్నివేశం 4-5 నిమిషాలుంటుంది.
శ్రీకాంత్, భరత్‌తో పనిచేయడం ఎలా ఉంది..?
ఇద్దరు యాక్టర్లతో పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ఇటీవల కాలంలో శ్రీకాంత్ చేసిన బెస్ట్ రోల్స్ లో హంట్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. నేను పనిచేసిన కోస్టార్లలో భరత్ ఉత్తమ నటుడు. నిడివి పరంగా ఆయన పాత్ర తక్కువగా ఉంటుంది. కానీ కథపై భరత్ పాత్ర ప్రభావం చాలా ఉంటుంది.
డైరెక్టర్ మహేశ్ గురించి..
ఓ యాక్టర్ నుంచి ఏం కావాలో మహేశ్‌కు బాగా తెలుసు. చాలా డెడికేషన్ ఉన్న వ్యక్తి. సినిమా ఉత్తమంగా రావడానికి మాతో స్క్రిప్ట్ గురించి చర్చిస్తుంటాడు. సినిమా విడుదలయ్యాక ఆయనకు వరుస ఆఫర్లు వస్తాయి.
మీ కొత్త సినిమాల మాటేంటి..?
మామా మశ్చీంద్రా చేస్తున్నానని మీ అందరికీ తెలిసిందే. దీంతోపాటు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమా చేస్తున్నా. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

