Yadadri | హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూలైన్లన్ని నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కార్తీక మాసం చివరి వారం కావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ మాడ వీధులు రద్దీగా మారిపోయాయి.
