De De Pyaar De 2 | బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) లీడ్ రోల్స్‌లో నటించిన మూవీ ‘దే దే ప్యార్ దే 2’ (De De Pyaar De 2). అన్షుల్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ మాధవన్ కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
ఓపెనింగ్ డేన వరల్డ్ వైడ్‌గా రూ.9.45 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.13.77 కోట్లు వసూళ్లు చేసింది. అంటే ఈ చిత్రం యావరేజ్‌గా రెండు రోజుల్లో మొత్తం రూ.23.22 కోట్లు రాబట్టింది. ఆదివారం సెలవు కావడంతో సినిమాకు వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. ఇప్పటివరకు మిక్స్డ్ రివ్యూస్ రాగా.. మరి ఆదివారం కలెక్షన్ల విషయంలో ఎంత స్థాయిలో పెరుగుదల ఉంటుందనేది చూడాల్సి ఉంది. మరి ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్ మైల్ స్టోన్‌కు చేరుకుంటుందా..? అనేది చూడాలి.
దే దే ప్యార్ దే ఫస్ట్ పార్ట్‌లో తనకంటే వయసులో చాలా చిన్నదైన ఆయేషా (రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆశిష్ (అజయ్ దేవగణ్) తన మాజీ భార్య (టబు) పర్మిషన్తోపాటు ఆమె కుటుంబం అంగీకారాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు.
ఆయేషా కుటుంబాన్ని ఆశీష్ ఎలా పెళ్లికి ఒప్పిస్తాడు అనే నేపథ్యంలో సీక్వెల్ సాగనుందని ఇప్పటికే ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. సీక్వెల్లో ఆయేషా తండ్రి రోల్లో కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఆర్. మాధవన్ నటించాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్కు లవ్ రంజన్ కథ అందించారు.2019లో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైర్ ‘దే దే ప్యార్ దే’కి సీక్వెల్‌గా వచ్చింది.
#DeDePyaarDe2 / #DDPD2 shows an encouraging 45.71% growth on Saturday, with significant contributions from urban centres… Holding steady on Sunday will be essential for securing a respectable weekend total.#DeDePyaarDe2 [Week 1] Fri 9.45 cr, Sat 13.77 cr. Total: ₹ 23.22 cr.… pic.twitter.com/fD1UrxGQwD
— taran adarsh (@taran_adarsh) November 16, 2025
Akhanda 2 | నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. 3డీ ఫార్మాట్లో ‘అఖండ 2’
Rajkummar Rao | తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ దంపతులు
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!