Road Accident | ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు దుర్మరణం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగిఉన్న ఇసుక లారీని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రఘునాథపల్లి నవంబర్ 16 : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిడిగొండ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై టీఎస్ 07 యుకె 5 4 6 9 నెంబర్ గల ఇసుక లారీ పార్క్ చేసి ఉంది. ఇదే క్రమంలో టీఎస్ 0 3 Z0046 నెంబర్ గల ఆర్టీసీ రాజధాని ఎక్స్‌ప్రెస్ హన్మకొండ నుండి హైదరాబాద్ వెళుతుంది. నిడిగొండ బ్రిడ్జి సమీపానికి రాగానే ఆగిన లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ దోమలగూడకు చెందిన పులంపరి ఓం ప్రకాష్ (75), హనుమకొండలోని బాలసముద్రంకు చెందిన నవజీత్ సింగ్ (48) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్ద చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్ తెలిపారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

