హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, మూడేండ్లు కావస్తున్నా ఒక హామీని నెరవేర్చలేదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు మూడేండ్లపాటు సహకరించినా సమస్యలు పరిష్కరించకుండా, ఇప్పుడు మరో రెండేండ్ల సమయం కావాలని కోరడం ఉద్యోగులపై ప్రభుత్వ అమానుష వైఖరిని స్పష్టం చేస్తున్నదని విమర్శించారు.