డేరా బాబాకు కరోనా పాజిటివ్
డేరా బాబాకు కరోనా పాజిటివ్ | డేరా బాబాగా పేరొందిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆదివారం కరోనా పాజిటివ్‌గా పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు.

చండీగఢ్ : డేరా బాబాగా పేరొందిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆదివారం కరోనా పాజిటివ్‌గా పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినులపై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో 2017 ఆగస్టులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. జైలు శిక్ష పడిన నాటి నుంచి ఆయన రోహ్తక్లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో కడుపు నొప్పి ఉందని చెప్పడంతో రోహ్తక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్)లో పరీక్షలు చేయించారు.
అనంతరం అక్కడి నుంచి మెదాంత దవాఖానాకు కొవిడ్ పరీక్షలకు తరలించారు. ఫలితాల్లో పాజిటివ్‌గా తేలిందని అధికారులు పేర్కొన్నారు. గత నెలలోనూ డేరా బాబా లోబీపీతో పీజీఎంఐఎస్ ఆసుపత్రిలో చేరగా.. కొవిడ్ పరీక్ష చేసుకునేందుకు నిరాకరించారు. ఇద్దరు సాధ్వినులపై అత్యాచారం చేసినందుకు 2017 ఆగస్టులో 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులో 2019 జనవరిలో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతనికి, మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఇటీవల తాను వ్యవసాయం చేసుకుంటానంటూ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను చేసిన నేరాలు క్షమించరాని పెద్ద నేరాలేమీ కాదని.. జైలులో తన సత్ప్రవర్తన చూసి పెరోల్ ఇవ్వాలని వేడుకున్నారు.
ఇవి కూడా చదవండి..
కెనడాలో వింత వ్యాధి
డెల్టా పెరిగింది.. కప్పా తగ్గింది!
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
Krishnapatnam : నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఘోరం.. పాక్‌లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

