‘అమృత్ ఉద్యాన్’గా మొఘల్ గార్డెన్స్ పేరు మార్పు.. రేపు ఆవిష్కరించనున్న రాష్ట్రపతి ముర్ము
జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సుమారు రెండు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి గార్డెన్స్‌ను తెరిచి ఉంచుతారు. అలాగే రైతులు, దివ్యాంగుల సందర్శనకు ప్రత్యేక తేదీలు కేటాయిస్తారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరును కేంద్ర ప్రభుత్వం శనివారం మార్చింది. ‘అమృత్ ఉద్యాన్’గా నామకరణం చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా మొఘల్ గార్డెన్స్ పేరును ఈ మేరకు మార్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా ఈ విషయాన్ని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి భవన్ గార్డెన్స్‌కు ‘అమృత్ ఉద్యాన్’ అని రాష్ట్రపతి ముర్ము పేరు పెట్టినట్లు చెప్పారు. జనవరి 29న (ఆదివారం) గార్డెన్ కొత్త పేరును ఆమె ఆవిష్కరిస్తారని వెల్లడించారు.
కాగా, జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సుమారు రెండు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి గార్డెన్స్‌ను తెరిచి ఉంచుతారు. అలాగే రైతులు, దివ్యాంగుల సందర్శనకు ప్రత్యేక తేదీలు కేటాయిస్తారు. హెర్బల్ గార్డెన్, మ్యూజికల్ గార్డెన్, స్పిరిచ్యువల్ గార్డెన్, దీర్ఘచతురస్రాకార, పొడవైన, వృత్తాకార ఉద్యానవనాలు వంటి ఎన్నో ప్రత్యేకతలున్న మొఘల్ గార్డెన్స్‌ను ఇప్పటి వరకు ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నెల రోజులు మాత్రమే సాధారణ ప్రజలను సందర్శనకు అనుమతించేవారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

