హనుమకొండ, జూలై 10 : మరో రెండున్నరేళ్ల పాటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల తరపున పోరాడాలని, కేసులు, బెదిరింపులకు ఎవరూ అధైర్య పడవద్దని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం హనుమకొండ స్నేహనగర్లోని ఎస్వీ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శ్రేణులతో బీఎల్ఏలకు సర్, సభ్యత్వ నమోదు, సోష ల్ మీడియాపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం కొంత కష్టకాలంలో పార్టీ, తాను ఉన్నానని, ఇప్పుడు తోడుగా ఉన్న వారికి అండగా ఉంటానని అన్నారు. గులాబీ జెండా మోసేవాళ్లని గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు, బీఎల్ఏలు చురుగ్గా పాల్గొంటున్నా రని, రానున్న కొన్ని రోజులు మరింతగా క్షేత్ర స్థాయిలో పనిచేయాలన్నారు.
ఓటర్ ఎన్యుమరేషన్ ఫారం పూర్తి చేయడంలో పార్టీ శ్రేణులు సహకారం అందించాలని వినయ్ భాస్కర్ సూచించారు. పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఓటర్ ఎన్యుమరేషన్ హెల్ప్ డెస్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రెడ్కో మాజీ చైర్మన్, సర్ ఇన్చార్జి వై సతీశ్ రెడ్డి మాట్లాడుతూ బీఎల్వోలతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని అన్నారు. బీఎల్ఏలు క్షేత్ర స్థాయిలో చివరి 14 రోజులు కష్టపడాలన్నారు. ఎన్యుమరేషన్ ఫామ్లు పూర్తి చేసేందుకు హెల్ప్ డెస్లతో పాటు క్షేత్ర స్థాయిలో బీఎల్ఏలు అందుబాటులో ఉండాలన్నారు. సర్ ప్రక్రియపై అనేక మందికి అనుమానాలు, అవగాహన తకువగా ఉందని, అందుకే మన పార్టీ తరపున బీఎల్ఏలు వారికి సహకారం అందించాలన్నారు. సర్పై ఎటువంటి అభ్యంతరాలు, నిబంధనల ఉల్లంఘన జరిగినా, వినయన్నకు, పార్టీకి తెలిపితే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ ఉద్యమకారులుగా, కేసీఆర్ సైనికులుగా తెలంగాణ కోసం సోషల్ మీడియా వేదికగా గొంతెత్తుదామని అన్నారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా బలంగా ఉందని ప్రత్యర్థులే అంటున్నారని, వినయన్న నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, వాటిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సోషల్ మీడియా వేదికగా పనిచేసే వారిపై ప్రభుత్వం కుట్రపూరితం గా వ్యవహరిస్తూ కేసుల పాలుచేస్తోందని, పార్టీ కోసం పనిచేసే వారు దాన్ని బలమైన ఆయుధంగా వాడుకోవాలన్నారు. అనంతరం అతిథులను మెమెంటో, శాలువాతో సతరించారు. సర్ ప్రక్రియలో సమర్థవంతంగా పని చేస్తున్న పలువురిని అభినందించారు. కార్యక్రమంలో సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కన్వీనర్ పులి రజినీకాంత్, నాయకులు జానకీరాములు, జోరిక రమేశ్, రామ్మూర్తి, రవీందర్రావు, మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ల అధ్యక్షులు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.