మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూలై 10 : దేశ భవిష్యత్‌ను మార్చే వజ్రాయుధం ఓటుహక్కు.. ఇంతటి ప్రాధాన్యమున్న ఓట రు జాబితాలో ఉన్న నకిలీ ఓటర్లను తొలగించి అర్హులైన కొత్త ఓటర్లను చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)చేపట్టింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ వందశాతం పూర్తి కాగా డిజిటైజ్డ్ ప్రక్రియ 25 శాతం పూర్తయ్యింది. నిర్దేశిత గడువులోపు విజయవంతంగా సర్ పూర్తి చేస్తామని కలెక్టర్ కుష్భూగుప్తా తెలిపారు. సర్‌పై శుక్రవారం ‘నమస్తే’ ఇం టర్వ్యూలో కలెక్టర్ మాట్లాడారు.
ప్రశ్న : పాలమూరు అంటేనే వలస జిల్లా అనే పేరుంది.. గల్ఫ్, దుబాయ్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి సమాచారం ఎలా చేరవేస్తారు.? వారి ఓటు సంగతేంటి.?
కలెక్టర్ : స్థానికంగా ఎవరు ఉంటున్నారు.. లేద నే విషయాలు బీఎల్వోలకు తెలుస్తాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుం టూ ఇతర దేశాలు, ప్రాం తాలకు వెళ్లివచ్చే వారిని టెంపరరీ మైగ్రేషన్ కిం ద రాస్తారు.. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకుంటే బీఎల్వోలు వారికి ఫోన్లో సమాచారం ఇస్తారు. జిల్లా, రాష్ట్రం, దేశవ్యాప్తంగా సర్ జరుగుతుంది. తెలియదు అని చెప్పడానికి లేదు. ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారందరూ ఎన్యూమరేషన్ ఫా రం పూరించాల్సిందే. దేశంలో ఏ ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉ న్నా.. ఆ ఎపిక్ నెంబరు చెప్పగలిగితే ఆ వివరాలు న మోదు చేసుకొని మీ కు ఓటు హక్కు కల్పిస్తారు. వలస, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వ్యక్తికి సంబంధించిన వివరాలను కుటుంబ పెద్ద, ఆ కుటుంబంలో 18ఏళ్లు దాటిన వ్యక్తి కూడా సబ్మిట్ చేయొచ్చు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తాత్కాలిక వలస వెళ్లిన వారిని పర్మినెంట్ మైగ్రేషన్ కింద ట్రీట్ చేయ్యం. తాత్కాలిక మైగ్రేషన్‌ను అక్క డ ఆ వ్యక్తి ఆర్డీనరీ రెసిడెంట్‌గానే ట్రీట్ చేస్తాం.
ప్రశ్న : బీఎల్వోలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చారా.? బీఎల్వోలుగా కారోబార్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సరైన విద్యార్హత లేనివారినే ఎక్కువగా నియమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి?
కలెక్టర్ : జిల్లా పరిధిలో 846మంది బీఎల్వోలకు పూర్తిస్థాయిలో అన్ని రకాలైన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు సందేహాలు నివృత్తి అయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ఒకటీ రెండు చోట్ల కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు మాకు సమాచారం వచ్చింది. బీఎల్వోలు ఒక్కొక్కరికి వెయ్యికి పైగా ఫారాలు ఉంటాయి. కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నా.. వాటిని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నాం. గ్రామ పంచాయతీ లు, ఎంపీడీవో, తాసీల్దార్, మండల, నియోజకవర్గాల వారీగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం. అలసత్వం ప్రదర్శించే బీఎల్వోను ఉపేక్షించేది లేదు. ఎవరికైనా ఫారం నింపేందుకు ఇబ్బందులు ఎదురైతే వలంటీర్లు గా వార్డ్డు అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, సం బంధిత అధికారులు అందుబాటులో ఉన్నారు.
ప్రశ్న : రెండు ఓట్లు ఉండొద్దు.. కానీ అసలు ఒక్కటీ కూడా లేకుంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదమే కదా? రేషన్ కార్డులు, పాస్‌పోర్టులు రావనే వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఆన్లైన్లో పొరపాట్లు జరిగితే మళ్లీ సరిచేసుకోవచ్చా?
కలెక్టర్ : ఓటు అనే వజ్రాయుధాన్ని మరింత పటిష్టం చేసేందుకే ‘(ఎస్ఐఆర్) సర్’. అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండాలి.. అనర్హులను తొలగించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ఇందులో ఎన్యూమరేషన్ ఫారం పొందడం.. తిరిగి సమగ్ర వివరాలు పూ రించి ఇవ్వడం అనేది అత్యంత ప్రధానం. పాస్‌పోర్టు, రేషన్‌కార్డుకు దీనికి ఏం సంబం ధం లేదు.. డిజిటైజేషన్ పూర్తయిన తర్వాత ఫొటో, పేర్లు, సర్ నేమ్ ఇలా అనేక రకాలైన చిన్న చిన్న తప్పులను సరిచేసుకోవచ్చు.
ప్రశ్న : టోల్ ఫ్రీ నెంబర్, ఎలక్షన్ కమిషన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ పాల్గొనే అవకాశం ఉందంటున్నా.. తప్పులు దొర్లితే సరిదిద్దుకునేందుకు వీలుంటుందా.?
కలెక్టర్ : టోల్ ఫ్రీ నెంబర్ 1950 జిల్లా, రాష్ట్రం, దేశవ్యాప్తంగా ఉంది. వచ్చే కాల్స్ సమగ్ర వివరాలు ఆయా జిల్లాల కలెక్టర్లు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, తాసీల్దార్లకు వస్తాయి. ఇక్కడ కూడా ఎన్యూమరేషన్ ప్రధానం. ఏవైనా పొరపాట్లు జరిగినా.. వాటిని డ్రాప్ట్రోల్ సమయంలో పరిశీలించి సరిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. బీఎల్వోల నెంబర్లు, పంచాయతీల వారీగా ప్రకటించాం. పంచాయతీ సెక్రటరీలకు, పొలిటికల్ పార్టీలకు సైతం అందజేశాం.
ప్రశ్న : గత ఎన్నికల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోని ఓటర్ల అడ్రస్‌లు పాలమూరులో చూపించాయి.. ఇతర ప్రాంతాల్లో ఉన్న మహబూబ్‌నగర్ ఓటర్లు అక్కడే ‘సర్’ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చా?
కలెక్టర్ : ఇతర ప్రాంతాలు, జిల్లాల వారి వివరాలు ఓటరు జాబితాలో గతంలో వచ్చాయి. వాటన్నింటినీ తొలగించారు. మన జిల్లావారు ఎక్కడున్నా.. జిల్లా, రాష్ట్రం, దేశం, దేశం బయట ఉన్నా.. ఆన్లైన్లో ’సర్’ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించవచ్చు.
ప్రశ్న : కొందరు బీఎల్వోలు వందశాతం ఎఫర్ట్ పెడుతున్నా.. ఓటర్లు, ఇంటి అడ్రస్‌లు దొరక్క చవిచూస్తున్నామని అంటున్నారు? ఎన్యూమరేషన్ ఫారాలు ఎప్పటిలోగా ఇవ్వాలి?
కలెక్టర్ : బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతున్నా ఓటర్లు అందుబాటులో లేరంటే వాళ్లు ఏ సమయంలో ఉంటున్నారనే విషయాన్ని ముందుగా గుర్తించాలి. ఓటర్ల సమయానికి అనుగుణంగా బీఎల్వోలు వారి ఇళ్లకు వె ళ్లాలి. కొన్ని చోట్ల నేను పరిశీలించా. శని, ఆదివారాల్లో ఎక్కువ మంది కన్పిస్తున్నారు. మరికొన్ని చోట్ల, గ్రామీ ణ ప్రాంతాల్లో ఉదయం పూట ఎర్లీమార్నింగ్ ఉంటున్నారు.. అట్లా వారు ఉన్నప్పుడే మనం వెళ్లాలి. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకునేందుకు బీఎల్వోలు మూ డుసార్లు మీ ఇంటికి వస్తారు.. ఆ సమయంలో ఎప్పుడైనా ఇవ్వవచ్చు.. లేదా బీఎల్వోలకు మీరే నేరుగా కలి సి ఇవ్వవచ్చు. లేదా జీపీ ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ సెంటర్లో కార్యదర్శి, బీఎల్వోకు ఇవ్వొచ్చు.
ప్రశ్న : సర్ సక్రమంగా జరిగితే తమ ఓటర్ల పేర్లు గల్లంతు అవుతాయనే ఆలోచనలో పలు రాజకీయ పార్టీలు సర్‌పై ఎటూ తేల్చుకోలేక.. కొన్ని చోట్ల బీఎల్ఏలను నియమిస్తూ.. మరికొన్ని చోట్ల బీఎల్ఏల ఊసే ఎత్తడం లేదు.?
కలెక్టర్ : పొలిటికల్ పార్టీల నుంచి ఒక్కొక్క పోలింగ్ బూత్‌కు బీఎల్ఏను ఇవ్వడం వారికి బాధ్యత ఉంది. కొన్ని చోట్ల మొదట్లో ఇవ్వలేదు. స్టార్టింగ్‌లో ఇస్తే మ రింత యాక్టివ్‌గా చేసే అవకాశం ఉండే. మనం సమావేశాలు నిర్వహించడం, అవగాహన కల్పి ంచడంతో ఆ ప్రక్రియలో అందరూ భాగస్వామ్యమవుతున్నారు.
ప్రశ్న : సర్ వందశాతం పూర్తయితే డీలిమిటేషన్లో నియోజకవర్గ సరిహద్దులు, రిజర్వేషన్లు మారతాయనే ఆందోళన రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీస్తోంది. మీరేమంటారు.?
కలెక్టర్ : డీలిమిటేషన్ అనేది కేంద్రం నిర్ణయం. ఈ ప్రాసెస్‌కు దానికి సంబంధం లేదు.. సర్‌లో ఓటరు లి స్టు క్లీన్ చేస్తాం.. డూప్లికేట్ ఓటర్లు, చనిపోయిన వారిని, అనర్హులను తొలగిస్తామంతే.!
ప్రశ్న : జిల్లాలో ఎన్యూమరేషన్ ఎంతవరకు పూర్తయ్యింది?
కలెక్టర్ : జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ 100శాతం పూర్తయ్యింది. జూలై 10న ఉదయం 10 గంటల వరకు మ హబూబ్‌నగర్ సిగ్మెంట్లో 2,64,235 మంది ఓటర్లకు 2,63,828 మందికి, జడ్చర్ల సిగ్మెంట్లో 2,25,911 ఓటర్లకు 2,25,379 మందికి, దేవరకద్ర సిగ్మెంట్లో 2,42,342 మంది ఓటర్లకు 2,42,278 ఎన్యూమరేషన్ ఫాంల పంపిణీ పూర్తయ్యింది. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు ఫీల్డ్‌లోనే ఉంటున్నారు. జిల్లాలో ఆన్లైన్ ప్రక్రియ 25 శాతం పూర్తవగా.. ఈ నెల 22వతేదీ వరకు వందశాతం పూర్తి చేస్తాం.