జయశంకర్ భూపాలపల్లి, జూలై 10(నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి ఏరియాలోని ఓ పెన్కాస్ట్ ప్రాజెక్టుల(ఓసీపీ) ప్రభావిత గ్రామాల్లో గూడు చెదిరిపో యి, భూములు కోల్పోయి తమకు జీవనోపాధి కరు వైందని, మేమెట్లా బతుకేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అలసత్వం వహిస్తూ ప్రభుత్వం తమ జీవితాలతో ఆటలాడు తోంద ని మండిపడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వకపోగా తమకు అవకాశాలు కల్పించకపోవడంతో పాటు తమ ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోవడంలేదని భూ నిర్వాసితులు సర్కారు, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం. భూపాలపల్లి ఏరియాలో 3 ఓపెన్ కాస్టులున్నాయి. జిల్లా కేంద్రంలో ఓసీపీ-2, గణపురం మండలంలో ఓసీపీ-3, మల్హర్ మండలంలోని తాడిచెర్లలో ఓసీపీ-3 ద్వారా బొగ్గు ఉత్పత్తి అవుతుంది.
ఓసీపీ-2 ప్రారంభ సమయంలో దీని ప్రభావిత గ్రామంగా భూపాలపల్లి మున్సి పాలిటీ పరిధిలోని గడ్డిగానిపల్లిని ఎంపిక చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి, 2017లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ క్రమంలో గడ్డిగానిపల్లిని త్వరగతిన తరలించేందుకు సింగరేణి యాజమాన్యం హడావిడి చేసింది. కానీ నేటి వరకు తరలించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ గ్రామంలో 951 ఇళ్లు, 555 కుటుం బా లు ఉన్నాయి. వీటిలో ఇంకా 70 నుంచి 80 మందికి ఇళ్లకు నష్టపరిహారం చెల్లించడం లేదు. పైగా గ్రామాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడా నికి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. దీంతో పాటు శాంతినగర్, బాంబులగడ్డ, గాంధీ నగర్, ఫక్కీరుగడ్డ, సీఆర్నగర్ కాలనీలు సైతం ఉన్నాయి.
వీటిపై కూడా ఓసీపీ-2 గనిలో జరు గుతున్న బ్లాస్టింగ్ ప్రభావంతో తీవ్రంగా గాయపడి ఇండ్లు కూలిపోయే దశకు కూడా చేరుకున్నాయి. అకడి ప్రజలు అనారోగ్యాలకు గురవు తున్నామని, తమను ఎక్కడికన్నా తరలించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గణపురం మండలంలోని కొండపల్లికి 300 మీటర్ల దూరంలో ఓసీపీ-3 గనిని తవ్వారు. ఈ గ్రామంలో 493 ఇండ్లు కలిగి, 36 ఎకరాల విస్తర్ణంలో ఉంది. సర్వేనిర్వహించి, ప్రీప్రైమరీ నోటిఫికేషన్, డిక్లరేషన్ నోటిఫికేషన్ సైతం పూర్తి చేశారు. కానీ నష్ట పరిహారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.
తాడిచెర్ల ఓసీపీ-3 పరిధిలోని కాపురం గ్రామంతో పాటు తాడిచెర్లలోని ఎస్సీ కాలనీ ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో 166 ఇళ్లు ఓసీపీ-3 ప్రభావితంలో ఉండగా వాటిలో 490 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమై నప్పటికీ ఇప్పటి వరకు ఆ గ్రామాన్ని సురక్షిత ప్రాం తానికి తరలించలేదు. మొత్తంగా 3 ఓసీపీలున్న నాలు గు గ్రామాల్లోని మొత్తం 1,590 కుటుంబాలు అనేక అవస్థలు పడుతున్నా యి. ప్రభావిత గ్రామాలకు అతిస మీపంలోనే ఈ గనులు ఉండడంతో ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆర్థికపరంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరితో పాటు భూపాలపల్లి పలు కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నప్పటికి అయినా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు.
ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల మూలంగా సమీపంలో నివసించే ప్రజలు తమకు ఉపాధి అవకాశాలు దెబ్బతి న్నాయని, నిత్యం సాగు చేసుకునే భూములు కోల్పోవ డమే కాకుండా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, కొద్ది సంవత్సరాల్లోనే కూలిపోయే దశకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓసీపీల్లో నుంచి బొగ్గు వెలికితీసేందుకు గాను చేసే బ్లాస్టింగ్ల వల్ల వచ్చే కార్బన్ మోనాక్సైడ్ అనే విష వాయువు వెలువడి, శరీర భాగా లకు అందాల్సిన ఆక్సిజన్ సరఫరా తగ్గిపో తుందంటు న్నారు.
శ్వాసకోశ వ్యాధులు వచ్చి దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తుల వాపు, దీర్ఘకాలిక శ్వాస సమస్యలు వస్తున్నాయని, మెదడుకు ఆక్సిజన్ తకు వగా అందడం మూలంగా తల తిరగడం, తలనొప్పి, వికారం, కళ్లు మసకబారడం, రక్తంలో ఆక్సిజన్ తగ్గడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుందని, ఇది గుండెపోటుకు దారితీయ వచ్చని చెబుతున్నారు. బ్లాస్టింగ్ మూలంగా దుమ్ము, ధూళి కణాలు గాలిలో కలిసిపోయి కంటి ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు కూడా వస్తున్నా యని, భారీ పేలుళ్ల వల్ల జరిగే శబ్ద కాలుష్యానికి మానసిక ఒత్తిడి పెరుగుతుందని, నిద్రలేమి, వినికిడి శక్తి తగ్గుతుందని తెలిపారు. సమీ పంలోని ఇళ్లకు బీటలు వారడంతో తకువ కాలంలో ఇళ్లు కూలిపోయే పరిస్థితి ఉంందని వాపోతున్నారు.
కానరాని వైద్య శిబిరాలు. ఓసీపీ ప్రభావిత గ్రామాల్లో ప్రతి 15 రోజులకు, నెల రోజులకు ఒకసారైనా వైద్య శిబిరాలను సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అలాంటి కార్యక్రమాలు ఏవీ ఈ ప్రాంతాల్లో కనిపించడం లేదు. ఇటీవలే గడ్డిగానిపల్లి ప్రజలు స్థానిక జీఎంను వైద్యశిబిరాలు నిర్వహించడం లేదని ఫిర్యాదు చేయగా ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి మొబైల్ వ్యాన్ తీసుకొ చ్చి అడదడపా మందులు ఇస్తున్నారే తప్ప… బీపీ, షుగర్, రక్త నమూనాలు సేకరించి ఏం జబ్బు లు ఉన్నాయో..? వాటికి సంబంధించిన వైద్యసేవలు ఇతర ఆస్పత్రులకు తరలించి అందించే చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓసీపీ-2 ప్రభావం కలిగి ఉన్న శాంతినగర్, హనుమాన్ నగర్, సీఆర్నగర్లో ఆరు నెలలకు ఒకసారి కూడా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం లేదని ఆ కాలనీలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నం పెట్టే భూములను ఓసీపీల్లో కోల్పోయాం. ఓసీపీ గ్రా మాలను తరలిస్తామని చెప్పి, ఏళ్లు గడుస్తున్న తమను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించడం లేదు. ఓసీపీలు ప్రారంభించే ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పారు. సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సకాలంలో నష్టపరిహరం చెల్లిస్తామని నమ్మబలికారు, కానీ ఇప్పటి వరకు తరలించ లేదు. కనీసం పర్యావరణ పరిరక్షణ చర్యలు కూడా పాటించడం లేదు. ఇక్కడ బ్లాస్టింగ్ లతో తీవ్ర అనారోగ్యాల పాలువున్నాం. భయంభయంగా బతుకుతున్నాం. ఇప్పటికైనా తమకు రావాల్సిన నష్ట పరిహారం చెల్లించి, తమ గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
– సెగ్గం సిద్ధు, గడ్డిగానిపల్లి