గద్వాల, జూలై 10 : సర్ ప్రక్రియ జిల్లాలో గందరగోళంగా కొనసాగుతుంది. సర్ ప్రక్రియపై ఓటర్లకు అనుమానాలు తలెత్తుతున్నా వాటిని నివృత్తి చేసే వారు కరువయ్యారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మొదలుకొని వాటిని తిరిగి ఇచ్చే వరకు సందేహాలు, అనుమానాలతో ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అధికారులు మాత్రం సర్ ప్రక్రియ వేగవంతంగా చేయాలని బీఎల్వోలను ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు జరుగకపోగా ఫారం నింపడంలో ఓటర్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటికి బీఎల్వోలు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఎన్యూమరేషన్ ఫారంలో 2002 ఏడాదికి సంబంధించి ఓటర్ల కార్డు వివరాలను పొందుపర్చాలని దరఖాస్తు ఫారంలో ఉంది. అయితే దీనిపై అసలు అనుమానాలు ఓటర్లు వ్య క్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఫారం నింపడం ఓ టర్లకు సవాలుగా మారింది.2002లో ఓటు హక్కు ఉ న్నవారిలో చాలా మంది వద్ద ప్రస్తుతం ఓటరు ఐడీ కా ర్డులు లేవు.
కొంత మంది ఇతర జిల్లాల నుంచి గద్వాల జిల్లాలో ఉంటున్నారు. వారు ఇక్కడే ఓటు హక్కు నమోదు చేసుకున్నా రు. అయితే 2002లో ఇక్కడి లేని వారి పరిస్థితి ఏమి టన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా శిక్షణ పొందిన బీఎల్వోలు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఫారాలు ఎలా నింపాలో తెలియజేయాలి. అవసరమైతే వారే నింపాలి. కానీ ఎక్కడా ఫారాలు నింపి ఇస్తున్న దాఖలాలు లేవు. ఫారాలు ఇస్తున్నారు.. వెళ్లిపోతున్నారు.. ఓటర్లను నింపి తీసుకొని రావాలని చెప్పడంతో ఎలా నింపాలో తెలియక తికమ కపడుతున్నారు. 2002 ఓటరు వివరాలపై అయోమ యం నెలకొన్నది జాబితాలో పేర్లు కనిపించకపోవడంతో వారు తమ ఓటు పోతుందో? ఏమో? అని ఆ ందోళన చెందుతున్నారు. చదువుకున్న వాళ్లే ఈ ఫారా లు నింపేందుకు అష్టకష్టాలు పడుతుండగా నిరక్ష్యరాసులు ఫామ్స్ పట్టుకొని తర్జనభర్జన పడ్తున్నారు. బీఎల్వోలు తక్కువగా చదివిన వారు ఉండడం.. ఫారాలు నింపడంలో సరైన అవగాహన లేక ఇబ్బందులు పడ్తున్నారు.
బీఎల్వోలకు యాప్ నిర్వహణ భారంగా మారింది. స్మార్ట్ ఫోన్లపై అవగాహన లేని బీఎల్వోలకు సరైన శిక్షణ లేక డాటా ఎంట్రీ చేయాలని చెప్పడంతో ఏం చేయాలో తోచక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బీఎల్వోలకు సహకరించే వారు లేక ఫారాలు నింపి ఆన్లైన్ చేసే ప్రక్రియ గడువులోగా పూర్తి కావ డం సాధ్యం కానట్లు తెలుస్తుంది. బీఎల్వోలకు విద్యావంతులైన యువకులు, ఉపాధ్యాయులను అటాచ్ చేస్తే సర్ ప్రక్రియ సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి. గ్రా మంలో లేని వారివి ఓటర్ల జాబితాలో ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక బీఎల్వోలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ తీవ్ర ఇబ్బందుల నడుమ కొనసాగుతోంది. బీఎల్వోలకు సరైన అవగాహన లేక పోవడంతో ఓటర్లు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫా రాలు నింపే విషయంలో స్పష్టత లేక అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సతమతమవుతున్నా రు. ఉన్నతాధికారులు స్పం దించి బీఎల్వోల కు మ రోసారి శిక్షణ ఇచ్చి స ర్ ప్రక్రియ సజావు గా జరిగేలా కృషి చేయాలని ఓ టర్లు కోరుతున్నారు.