కాజీపేట, డిసెంబర్ 23 : బీఆర్ఎస్ పాలనలోనే సర్వ మతాలకు సమానం ప్రాతినిధ్యం లభించిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణం బాపూజీ నగర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని మతాలను ఆదరించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని అన్ని పండుగలను ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
క్రీస్తు జీవన విధానం మనందరికీ ఆదర్శమన్నారు. బైబిల్ని చదివి దాని సారాన్ని నిజ జీవితంలో పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, పాస్టర్ జాషువా, బీఆర్ఎస్ నాయకులు నార్లగిరి రమేష్, సుంచు కృష్ణ, కాటపురం రాజు, ఎండీ అఫ్జల్, సోని, గబ్బెట కరుణ్ , డివిజన్ అధ్యక్షులు దువ్వ కనుకరాజ్ , బేధరకోట రంజిత్, తేలు సారంగపాణి, బరిగెల వినయ్, ఎంబా మహుముద్, సుంచు అశోక్, హుస్సేన్ , దువ్వ నరేష్ , బొల్లె కుమార్, కాళేశ్వరం శ్రీకాంత్, రామగిరి రాంచందర్, మర్యాల కృష్ణ, తండమళ్ళ వేణు, మతిన్, మంద రాజ్ కుమార్, శ్రీకాంత్ , బిల్డర్ రాజ్ కుమార్ , బండి విజయ్, మంద శ్రీనివాస్ , యాకుబ్ రాబర్ట్, నాయీని విజయ, బంగారు సవిత, కొండేటి మంజుల, బంగారి రజిని, నవత , ఎనగందుల సురేష్ , కొండేటి వివేక్, గబ్బెట సింయోన్, మైదం ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.