నల్లగొండ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, సీనియర్ నేత హరీష్ రావుకు నోటీసులు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి లీకులు ఇవ్వడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు ఇస్తామని రేవంత్ రెడ్డి ఇవాళ లీకు ఇచ్చిండని జగదీశ్‌రెడ్డి చెప్పారు.
వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి ఫోన్ ట్యాపింగ్ గురించి ఏడుస్తున్నాడని మాజీ మంత్రి విమర్శించారు. కరెంట్ గురించి ఇలాగే ఏడ్చిండని, దానికి సంబంధించిన రిపోర్టు రాగానే సిగ్గుతో మడిచి కనబడని చోట పెట్టుకున్నడని అన్నారు. ‘కేసీఆర్ మల్లెపూవు లాగ ఉన్నాడురా.. కాంగ్రెస్, బీజేపీల కంటే గొప్పగా 24 గంటలు కరెంట్ ఇచ్చిండు’ అని రిపోర్టులో వచ్చిందని ఆయన గుర్తుచేశారు. కాళేశ్వరం మీద కూడా రేవంత్ ఏడ్చిండని, కానీ కోర్టు దాన్ని రిపేర్ చేయిరా అని చెప్పిందని అన్నారు.