DQ 41 | మాలీవుడ్ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులు, మూవీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఈ స్టార్ యాక్టర్ రీసెంట్గా కొత్త తెలుగు సినిమాను ప్రకటించగా.. DQ41 (వర్కింగ్ టైటిల్)తో వస్తోంది. రవి నేలకుడిటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని వన్ ఆఫ్ ది టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ ఎస్ఎల్వీ సినిమాస్ తెరకెక్కిస్తోంది.
తాజాగా ఈ చిత్రంలో మరో టాలెంటెడ్ యాక్టర్ జాయిన్ అయ్యాడు. రీసెంట్గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు కన్నడ యాక్టర్ దీక్షిత్‌శెట్టి. దీక్షిత్‌శెట్టి పుట్టినరోజు (డిసెంబర్ 22) సందర్భంగా మేకర్స్ DQ41 అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇందులో దీక్షిత్‌శెట్టి ఎలాంటిపాత్రలో కనిపిస్తాడనేది సస్పెన్స్‌లో పెట్టేశారు.
ఈ చిత్రంలో పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందని ఇటీవలే ప్రకటించారు మేకర్స్. కాగా మేకర్స్ ఇప్పుడు మరో క్రేజీ అనౌన్స్మెంట్ చేశారు. బాహుబలి స్టార్ రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
బాహుబలి ప్రాంచైజీలో శివగామి లాంటి పవర్ ఫుల్ రోల్‌తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది రమ్యకృష్ణ. ఇంతకీ రమ్యకృష్ణ ఈ ప్రాజెక్టులో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. DQ41 షూటింగ్ దశలో ఉంది.
Team #DQ41 wishes the versatile @Dheekshiths a very Happy Birthday ❤🔥
Your hard work and passion for cinema makes you truly special ✨
Excited to have you on board for this special film ❤️#SLVC10
Starring @dulQuer, @hegdepooja, @meramyakrishnan
Directed by… pic.twitter.com/vcFybj9GNc— SLV Cinemas (@SLVCinemasOffl) December 22, 2025
Ram Gopal Varma | ‘నీ నీతులు ఇంట్లోనే చెప్పుకో’.. నటుడు శివాజీకి ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్
Nupur Sanon | కృతి సనన్ సోదరి పెళ్లికి వేళాయే.. ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారంటే..!
Mogullapalli | వైద్య సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : అరెల్లి రమేష్ గౌడ్