Actor Shivaji | ‘దండోరా’ సినిమా ఈవెంట్లో టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ సింగర్ చిన్మయి, అనసూయ, మంచు మనోజ్ అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందిస్తూ.. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
”శివాజీ పూర్తి పేరు కూడా తనకు తెలియదని పేర్కొంటూనే అతడిని ఉద్దేశిస్తూ ఆర్జీవీ ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. “హేయ్ శివాజీ.. నువ్వు ఎవరివైనా, ఎలాంటి వాడివైనా నాకు అనవసరం. నీలాంటి ఒక అసభ్యకరమైన పద్ధతి లేని వ్యక్తిని నీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తున్నారు కాబట్టి.. వెళ్లి నీ నీతులు వాళ్లకి చెప్పుకో. అంతేగాని సమాజంలో ఉన్న మహిళలపై గానీ, చిత్ర పరిశ్రమలో ఉండేవారిపై గానీ నీ చెత్త అభిప్రాయాలను రుద్దకు” అంటూ శివాజీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా.. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.
I don’t know that fellows full name and hence I am commenting here… Hey Shivaji whatever you are , if the women in your home are willing to bear a uncouth dirty guy like you , you are welcome to moral police them ..With regard to the other women in society or film industry or… https://t.co/OKoXdMXMxk
— Ram Gopal Varma (@RGVzoomin) December 23, 2025