హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో చోటుచేసుకున్న కులవివక్ష దాడి, పసికందు మృతిపై జాతీయ మావనహక్కుల క మిషన్ తీవ్రంగా స్పందించింది. ఘటన జరిగి ఇన్నిరోజులైనా నిందితులను అరెస్టు చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యంపై జోక్యం చేసుకున్నది. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పసికందు మరణంపై అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ(దామెర వినోద్‌కుమార్) దాఖలు చేసిన ఫిర్యాదుపై క మిషన్ స్పందించింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యల నివేదికను 4 వారాల్లోగా సమర్పించాలని ఆదేశిస్తూ నాగర్‌కర్నూల్ కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 18న కుమ్మెర మల్లన్న స్వామి జాతర సందర్భంగా చిలుకేశ్వరం చంద్రకళ కుటుంబంపై అమాను ష దాడి జరిగింది. బాధితుల ఫిర్యాదు ప్రకా రం.. కులం కారణంగా ఆలయంలోకి ప్రవేశా న్ని నిందితులు నిరాకరించారు. ఈ క్ర మం లో బాధితులపై దాడి చేయడమే కాకుండా, రెండు నెలల పసికందును ఉద్దేశపూర్వకంగా తొకడంతో శిశువు మరణించింది.
చట్టాన్ని బాధితుల పక్షాన అమలు చేయాల్సిన పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారని అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ తన ఫిర్యాదు లో పేరొన్నారు. బాధితులు నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు, నిందితులకు ఉన్న రాజకీయ పలుకుబడి కారణంగా ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించారని ఆరోపించా రు. ఈ చర్యలు రాజ్యాంగ రక్షణను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని ఎన్హెచ్ఆర్సీ గుర్తించి ఆదేశాలు జారీ చేసిం ది. పోలీసుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు రక్షణతోపాటు పరిహారం అందించాలని కమిషన్ ఆదేశించింది.
కుమ్మెర ఘటనలో రెండు నెలల పసికందు మృతికి కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను బీఆర్ఎస్ నేత ఉపేంద్ర కోరారు. ఈ మేరకు గురువారం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసినట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణం వెలుగుచూసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఉపేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.