మొగుళ్లపల్లి, డిసెంబర్ 23 : పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వేములపల్లి సర్పంచ్ అరెల్లి రమేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పశువైద్యాధికారి డా. రాకేష్ ఆధ్వర్యంలో వేములపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా పశువైద్య ఉప కేంద్రం జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ఉచిత నట్టల మందులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవాలకు సరైన సమయంలో టీకాలు ఇప్పించి ఆర్థికంగా ప్రయోజనం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తూరు శంకర్చ, యాదవ సంఘం అధ్యక్షుడు పెంట శ్రీనివాస్, రైతులు తిరుపతి, గట్టుస్వామి, రాములు, లక్ష్మణ్, కొమురయ్య, పశువైద్య సిబ్బంది రాజన్న పాల్గొన్నారు.