హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ కేసులను ములుగు జీజీహెచ్, ఎంజీఎంలకు తరలించాలని సూచించారు.
జాతరలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్పై నిఘా ఉంచాలని, అక్కడ ఏర్పాటు చేసిన దవాఖానాలు, మెడికల్ క్యాంపుల లొకేషన్లు భక్తులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతర ముగిసే వరకు డీహెచ్ను అక్కడే ఉండి పర్యవేక్షించాలని సూచించారు. జాతర సందర్భంగా 544 మంది డాక్టర్లతో సహా 3,199 సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు అధికారులు మంత్రికి వివరించారు. జాతరను నిత్యం పర్యవేక్షిస్తూ భక్తులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని దామోదర రా జనర్సింహ సూచించారు.