కంగ్టి, ఫిబ్రవరి 24 : దళితబంధు లబ్ధ్దిదారులకు వెంటనే యూనిట్లు మంజూరు చేయాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంగ్టిలో దళితబంధు లబ్ధ్దిదారులకు మద్దతుగా క్రాంతి చౌక్ నుంచి ఎంపీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ .. బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో 739 మందికి దళితబంధు మంజూరు చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా దళితబంధు నిధులను అందించక పోవడం దారుణమని మండిపడ్డారు. దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.