రష్యా నుంచి అమెరికాపై సైబర్ దాడులు: ఎఫ్‌బీఐ డైరెక్టర్
రష్యాలో కూర్చున్న హ్యాకర్లు అమెరికాలో సైబర్ దాడులు జరిపినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తెలిపింది

వాషింగ్టన్: రష్యాలో కూర్చున్న హ్యాకర్లు అమెరికాలో సైబర్ దాడులు జరిపినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తెలిపింది. దాడులకు వందకు పైగా వివిధ రకాల రాన్సమ్వేర్ను ఉపయోగించారని పేర్కొన్నది. వాల్ స్ట్రీట్ జనరల్‌కు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో చాలావరకు రాన్సమ్వేర్ను రష్యన్ హ్యాకర్లు సృష్టించారని చెప్పారు.
గత నెలలో సైబర్ క్రైమినల్స్ అమెరికాకు చెందిన అతిపెద్ద గ్యాసోలిన్ పైప్‌లైన్ పంపిణీ నెట్‌వర్క్‌ను హ్యాక్ చేసి పెద్ద దెబ్బ తీశారు. ఈ పైప్‌లైన్ యూఎస్‌లోని ఆగ్నేయ ప్రాంతానికి ఇంధనాన్ని అందించే ప్రముఖ సంస్థ. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పర్యవేక్షణలో ఇప్పటివరకు వివిధ ఏజెన్సీలు సైబర్ దాడులపై దర్యాప్తు చేస్తున్నాయి. ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ఇంటర్వ్యూ అంశాలను భావోద్వేగ ప్రకటన అని రష్యా తెలిపింది. హానికరమైన ప్రయోజనాల కోసం సైబర్ క్రైమినల్స్ రాన్సమ్వేర్ను సృష్టిస్తున్నారు. ఇది ఒక రకమైన సాఫ్ట్వేర్. ఈ-మెయిల్ లేదా ఇతర మార్గాల ద్వారా కంప్యూటర్లో చొప్పించడం ద్వారా తమ ఆధీనంలోకి తీసుకుని తమ డిమాండ్లను సాధించుకుంటారు.
ఇవి కూడా చదవండి..
ఆఫ్ఘాన్‌లో ప్రభావాన్ని పెంచుకోవడంపై చైనా దృష్టి
కేరళ బడ్జెట్: 20 వేల కోట్లతో రెండో కొవిడ్ ప్యాకేజీ ప్రకటన
ప్రాజెక్ట్ 75 : రూ.50 వేల కోట్లతో 6 జలాంతర్గాముల నిర్మాణం
కరోనా టైం: సప్లిమెంట్స్ నకిలీలను ఇలా కనిపెట్టండి..!
పోస్ట్-కొవిడ్ ఫిట్నెస్ : నిత్యం 10 కి.మీ పరిగెత్తుతున్న మిలింద్ సోమన్
ముమ్మాటికీ బెట్టింగే : లూడోను లక్కీ గేమ్‌గా ప్రకటించాలని పిటిషన్
లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
ఐఐటీయన్ల ప్రతిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
చైనా చరిత్రలో మరిచిపోలేని మరక.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

