e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News భారీగా త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు.. పెట్రోల్ రేట్లు త‌గ్గుతాయా?

భారీగా త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు.. పెట్రోల్ రేట్లు త‌గ్గుతాయా?

న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో రేట్లను మార్చ‌కుండా స్థిరంగా ఉంచాయి ఆయిల్ కంపెనీలు. అయితే ఈ కాలంలో అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు మాత్రం భారీగా త‌గ్గాయి. గ‌త 10-14 రోజుల్లోనే ముడి చ‌మురు ధ‌ర‌లు ప‌ది శాతం మేర త‌గ్గ‌డం గ‌మ‌నార్హం.

అయితే ఈ త‌గ్గిన ధ‌ర‌ల‌ను ఆయిల్ కంపెనీలు వినియోగ‌దారుల‌కు బ‌దిలీ చేయాల‌ని నిర్ణ‌యిస్తే మాత్రం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గుతాయి. రెండు వారాల కింద‌ట బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర 70 డాల‌ర్లు కాగా.. అది ఇప్పుడు 63.98 డాల‌ర్ల‌కు చేరింది.

- Advertisement -

ఇక అటు యూఎస్ క్రూడ్ ఆయిల్ అయితే బ్యారెల్‌కు 60.94 డాల‌ర్ల‌కు త‌గ్గింది. ‌పెట్రోల్ రేట్లు సెంచ‌రీకి చేరువ కావ‌డానికి అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే కార‌ణ‌మ‌ని చెబుతూ వ‌చ్చిన సంస్థ‌లు.. ఇప్పుడు త‌గ్గిన‌ప్పుడు మాత్రం ఆ ప్ర‌యోజ‌నాన్ని వినియోగదారుల‌కు ఇవ్వ‌డం లేదు. ముడి చ‌మురు ఉత్ప‌త్తి పెర‌గ‌డం, క‌రోనా కార‌ణంగా కొన్ని దేశాలు మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించ‌డంతో ముడిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గిపోయాయి.

ఇవి కూడా చదవండి..

జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?

మ‌నుషులు ఒకప్పుడు మార్స్‌పై ఉండేవారట‌.. ఇందులో నిజ‌మెంత‌?

వన్డేల్లో 61వ అర్ధశతకం నమోదు చేసిన కోహ్లీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement