Huzurabad | హుజూరాబాద్ రూరల్, మే 29 : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నెమెంట్ గురువారం ముగిసింది. గెలుపొందిన క్రికెట్ జట్టుకు హుజూరాబాద్ ఎస్సై యూనస్ అలీ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సిటిజన్ ఫోరం రాష్ట్ర నాయకులు చందుపట్ల జనార్ధన్, మాజీ సర్పంచ్ చందుపట్ల పరంధాములు, మాజీ ఉప సర్పంచులు చెన్నోజు భద్రయ్య, సందుపట్ల రాజేందర్, గ్రామ పెద్దలు సందుపట్ల రాజమౌళి, మంతెన సురేందర్ , మంతెన శ్రీనివాస్, నందిపేట పరమేశ్వర్, మామిడి రమేష్, దేవునూరి కిరణ్, బైరెడ్డి రాజిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్, కొండబోయిన సారయ్య, పోచంపల్లి రాజు ,పోగు సమ్మయ్య, కంకణాల వెంకటేష్ ,జూపాక కన్నయ్య, కంకణాల కొమురయ్య, గూళ్ల శ్రీనివాస్, టీమ్స్ కెప్టెన్లు బోల్లవేణి రాజు, బోళ్ల ప్రశాంత్ ,కంకణాల అంజి, తమ్మ ప్రదీప్ ,రాచర్ల సుమన్, బన్నీ, గ్రామ ప్రజలు పాల్గొ న్నారు.