ధర్మసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని సీపీఐ గ్రామశాఖ కార్యదర్శి వల్లపురెడ్డి ధర్మారెడ్డి కోరారు. శుక్రవారం మేడే సందర్భంగా మండలంలోని నారాయణగిరి గ్రామంలో జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. భూభారతిలో చాలా లోపాలు ఉన్నాయని అన్నారు. వీటిని ఆసరాగా చేసుకుని ఒకరి భూమి మరొకరు పట్టా చేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి భూ సమస్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ఎవరి భూమిని వారికి పట్టాలు చేయాలని కోరారు.