హైదరాబాద్, జూన్ 3 (నమస్తేతెలంగా ణ): తమ భూమి సమస్యకు పరిష్కారం చూ పనందుకు మనస్తాపంతో దంపతులిద్దరూ సె క్రటేరియట్ సాక్షిగా బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సెక్రటేరియట్ ప్రధా న ద్వారం సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆ త్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ గ్రామాని కి చెందిన పుట్ట కృష్ణయ్య, ఆయన భార్య సైద మ్మ తమ భూమి సమస్యపై న్యాయం కోసం గత మూడు రోజులుగా అధికారుల చుట్టూ తి రుగుతున్నారు. అయినా తమ వినతిని ఎవ రూ పట్టించుకోవడం లేదని ఆ దంపతులు తీ వ్ర ఆవేదనకు గురయ్యారు.
బుధవారం ఉద యం పెట్రోల్ డబ్బాతో సెక్రటేరియట్ వద్దకు చేరుకొని ఇద్దరూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొనేందుకు యత్నించారు. గమనించిన అక్కడి ఎస్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే వారి శరీరాలపై నీళ్లు చల్లారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం ఆ దంపతులను విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి భూమి సమస్యకు సంబంధించిన వివరాలను సైఫాబాద్ పోలీసులు సేకరిస్తున్నట్టు సమాచారం.