Real estate sector | రియల్టీకి చావుదెబ్బ..పేదలకు సొంతింటి కల శాశ్వతంగా దూరం
తెలంగాణలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని చావుదెబ్బ తీసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 5 నుంచి రాష్ట్రంలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేయాలని నిర్ణయించింది.
- సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను 5 నుంచి అమలు చేయాలని సర్కార్ నిర్ణయం
- పేదలకు సొంతింటి కల శాశ్వతంగా దూరం
- రాష్ట్రంలో ఇప్పటికే కుప్పకూలిన స్థిరాస్తి రంగం
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని చావుదెబ్బ తీసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 5 నుంచి రాష్ట్రంలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇది ఇప్పటికే మందగమనంలో ఉన్న స్థిరాస్తి రంగానికి ఉరితాడుగా మారబోతున్నది. మారెట్ ధరలకు అనుగుణంగా, శాస్త్రీయంగానే ధరలు పెంచామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయి.
ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఈ నిర్ణయం ‘మూలిగే నకపై తాటిపండు’ పడిన చందంగా ఉన్నదని ఐటీ, నిర్మాణ రంగ నిపుణులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా భూముల క్రయవిక్రయాలు గణనీయంగా పడిపోయాయి. బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పూర్తిగా కుదేలైంది. ఐటీ (సాఫ్ట్వేర్) రంగంలో నెలకొన్న ఒడిదొడుకులు, మందగమనం వల్ల కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భూములు కొనే నాథుడు లేక రియల్టర్లు, ఇండ్లు కట్టే ధైర్యం చేయలేక బిల్డర్లు చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూముల మారెట్ విలువలు పెంచడమంటే వెంటిలేటర్‌పై ఉన్న రోగికి ప్రాణవాయువు (ఆక్సిజన్) తీసేయడమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆకాశాన్నంటుతున్న నిర్మాణ వ్యయం
నిర్మాణ రంగానికి సంబంధించిన ముడిసరుకుల ధరలు ఇప్పటికే సామాన్యుడికి, బిల్డర్లకు చుకలు చూపిస్తున్నాయి. స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర, టైల్స్, ఎలక్ట్రికల్ వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు డీజిల్, పెట్రోల్ ధరల మంట రవాణా ఖర్చులను తడిసి మోపెడు చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ విలువలను 25 నుంచి 100% మేరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారులు, స్టేట్ హైవేల పకన ఉన్న ప్రైమ్ ల్యాండ్స్ విలువను కనీసం 50%, వాణిజ్య భూముల విలువను ఎకరాకు కనీసం రూ.10 లక్షలు పెంచబోతున్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న భూముల క్రయవిక్రయాలు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉన్నది.
పడిపోతున్న రాబడికి కాగ్ లెకలే సాక్ష్యం
ప్రభుత్వ అనాలోచిత విధానాలకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలే అద్దం పడుతున్నాయి. గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి రూ.14,295 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది అప్పటి బడ్జెట్ అంచనాల్లో 77.27 శాతానికి సమానం. కానీ, కాంగ్రెస్ అ ధికారంలోకి వచ్చాక 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబడి దారుణంగా రూ. 8,473 కోట్లకు పడిపోయిం ది. ఇది బడ్జెట్ అంచనాల్లో కేవలం 45.48 శా తమే. దీన్ని బట్టే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఎంతలా కుదేలైందో అర్థం చేసుకోవచ్చు. అం దుకు కారణాలేమిటో పరిశీలించి రియల్ ఎస్టే ట్ రంగాన్ని ఆదుకోవాల్సిన రేవంత్‌రెడ్డి సర్కా ర్ భూముల మార్కెట్ విలువను మరింత పెం చడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది.
ప్రజల పాలిట శాపమే
రాష్ట్రంలో ఇండ్ల స్థలాలు, అపార్ట్మెంట్ల విలువలు పెంచాలన్న నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను శాశ్వతంగా చెరిపేసే అవకాశం ఉన్నది. ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం స్థిరాస్తి రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసి, లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించకపోతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పు తప్పదని ఆర్థిక, స్థిరాస్తి రంగాల నిఫుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి ఎప్పుడైనా స్పష్టమే : కేటీఆర్
Mayawati | ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి: మాయావతి
GLP-1 Medicine | జీఎల్పీ-1 మందులను వాడడం ఆపేస్తే ఏం జరుగుతుంది..? ఎలాంటి పరిణామాలు ఉంటాయి..?
BRS Bahrain | బహ్రెయిన్‌లో ఘనంగా దీక్షాదివస్..కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం : సతీష్ కుమార్
Naga Chaitanya | కమర్షియల్ సినిమా మారిపోయింది.. ఐదు పాటలు పెడితే ల్యాగ్ అంటున్నారు: నాగ చైతన్య
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

