Road Accident | వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి దగ్గర ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందింది.
మృతులు తాండూరు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, యాక్సిడెంట్ తర్వాత పారిపోయిన లారీ డ్రైవర్.. పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది.