Road Accident | పెళ్లి బస్సును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు దుర్మరణం
Road Accident | వివాహ వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ మీనీ బస్సు (Mini Bus) ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 12 మందిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ సహా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Road Accident : వివాహ వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ మీనీ బస్సు (Mini Bus) ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 12 మందిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ సహా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం హాపూర్ జిల్లా (Hapur district) లో దౌలానా-గులవాటి (Dhaulana-Gulavati) రహదారిపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి వేడుకకు వెళ్లిన మినీ బస్సు వేడుక అనంతరం 12 మందితో తిరుగు పయనం అయ్యింది. మార్గమధ్యలో దౌలానా-గులవాటి రోడ్డుపై ఎదురుగా వచ్చిన లారీ.. బస్సును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరణించిన ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించామని చెప్పారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

