Asha Bhosle | ఆశా భోస్లేకు తీవ్ర అనారోగ్యం.. ముంబై ఆస్పత్రిలో అత్యవసర చికిత్స..!
Asha Bhosle : ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే (Asha Bhosle) ఆస్పత్రి పాలయ్యారు. ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం (Cardiac Arrest) ఆగిపోవడంతో ఆమెను హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు.
Asha Bhosle : ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే (Asha Bhosle) ఆస్పత్రి పాలయ్యారు. ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం (Cardiac Arrest) ఆగిపోవడంతో ఆమెను హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. 92 ఏళ్ల భోస్లేకు అత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె మనువరాలు జనాయ్ భోస్లే (Zanai Bhosle) సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.
లెజెండరీ గాయని ఆశా భోస్లే శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం హఠాత్తుగా ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. దాంతో, కుటుంబసభ్యులు భోస్లేను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె చిన్న కుమారుడి కూతురు, మనువరాలు జనాయ్ భోస్లే సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.
My grandmother, Asha Bhosle due to extreme exhaustion and suffering a chest infection has been admitted to hospital and we request you to value our privacy. Treatment is ongoing and hopefully everything will be well and we shall update you positively.
— Zanai Bhosle (@ZanaiBhosle) April 11, 2026
‘మా నానమ్మ ఆశా భోస్లే ఆస్పత్రి పాలయ్యారు. తీవ్రమైన అలసట, ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెను ఆస్పత్రికి తరలించాం. ఈ సందర్భంగగా మా కుటుంబ గోపత్యను గౌరవించాలని అభ్యర్థిస్తున్నా. ప్రస్తుతం నానమ్మకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నా. నానమ్మ ఆరోగ్యం గురించిన అప్డేట్స్ను మీతో పంచుకుంటాను’ అని ఎక్స్ వేదికగా జనాయ్ భోస్లే పేర్కొంది.
ప్రస్తుతం అత్యవసర చికిత్స విభాగంలో ఆశా భోస్లేకు ట్రీట్మెంట్ అందిస్తున్నామని డాక్టర్ ప్రతిత్ సందానీ తెలిపారు. భోస్లే ఆరోగ్యం ఎలా ఉంది? చికిత్సకు ఎలా స్పందిస్తున్నారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Legendary playback icon Asha Bhosle suffered a cardiac arrest on Saturday, April 11 and has been admitted to Breach Candy Hospital in Mumbai where she is currently undergoing treatment in the Emergency Medical Services unit: Breach Candy Hospital Docter Pratit Samdani pic.twitter.com/ZOU4ELK6fI
— IANS (@ians_india) April 11, 2026
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

