Watch: మంత్రికి తప్పిన ముప్పు.. వాహనాల పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ ల్యాండ్
Chhagan Bhujbal | ఒక మంత్రికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ నిర్దేశించిన హెలిప్యాడ్‌ను దాటి వెళ్లింది. సమీపంలోని వాహనాల పార్కింగ్ స్థలంలో అది ల్యాండ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: ఒక మంత్రికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ నిర్దేశించిన హెలిప్యాడ్‌ను దాటి వెళ్లింది. సమీపంలోని వాహనాల పార్కింగ్ స్థలంలో అది ల్యాండ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ( Chhagan Bhujbal) మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ శనివారం పూణే జిల్లాలో పర్యటించారు. ఖాన్వాడి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో చేరుకున్నారు.
కాగా, మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రయాణించిన హెలికాప్టర్ హెలిప్యాడ్‌ను దాటి వెళ్లింది. హెలికాప్టర్ రోటర్ల వల్ల గాలిలోకి దుమ్ము ఎగజిమ్మింది. దీంతో పైలట్‌కు ఏమీ కనిపించకపోవడంతో ల్యాండింగ్ ప్రదేశాన్ని దాటించాడు. గోడ అవతల ఖాళీగా ఉన్న వాహనాల పార్కింగ్ స్థలంలో ఆ హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశాడు. అయితే ఈ సంఘటన వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
మరోవైపు పోలీస్ అధికారులు వెంటనే ఆ హెలికాప్టర్ వద్దకు చేరుకున్నారు. తప్పుగా ల్యాండింగ్ చేసిన విషయాన్ని పైలట్‌కు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆ హెలికాప్టర్‌ను నిర్దేశిత హెలిప్యాడ్‌కు తరలించి ల్యాండ్ చేశారు. ఈ సంఘటన వల్ల ఏర్పడిన అంతరాయం తర్వాత మంత్రి ఛగన్ భుజ్‌బల్ తన కార్యక్రమాలను కొనసాగించారు. అయితే పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
महाराष्ट्र –
नासिक से पुणे जा रहे मंत्री छगन भुजबल का हेलीकॉप्टर हेलीपेड की जगह कार पार्किंग में उतार दिया गया। CM देवेंद्र फडणवीस ने जांच का आदेश दिया है। अभी ये स्पष्ट नहीं हुआ है कि पायलट ने ऐसा क्यों किया? https://t.co/UUfcpgD10P pic.twitter.com/75qagwkPic— Sachin Gupta (@Sachingupta) April 11, 2026
Also Read:
Hostel Boy Murder | హాస్టల్లో బాలుడిపై అసహజ లైంగిక దాడి, హత్య.. గార్డ్ అరెస్ట్
Woman killed in PG | పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో మహిళ హత్య.. బెడ్ బాక్స్‌లో మృతదేహం
Watch: న్యాయవాదిని కాల్చి చంపిన దుండగులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

