రామన్నపేట, నవంబర్ 08 : పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన సిపిఐ మండల కౌన్సిల్ సమావేశానికి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిపిఐ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఖమ్మం బహిరంగ సభ జయప్రదం కోసం హైదరాబాద్ నుండి బస్సు జాతా ప్రారంభమై ఈ నెల 20, 21న యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకుంటున్న సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజానాట్య మండలి కళాకారులు స్వాగతం పలికి బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎర్ర రమేశ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండీ ఇమ్రాన్, మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ, ఏఐటీయూసీ మండల కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, సీనియర్ కామ్రేడ్ బాలగోని మల్లయ్య, ఊట్కూరు భగవంతు, గంగాపురం వెంకటయ్య, ఊట్కూరి కృష్ణ, జగన్నాథం, పెండం రవీందర్, మీసం గాలయ్య, పట్ల నరసింహ, రచ్చ దయాకర్ పాల్గొన్నారు.