Ramannapet : పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి : యానాల దామోదర్ రెడ్డి
పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన సిపిఐ మండల కౌన్సిల్ సమావేశానికి..
రామన్నపేట, నవంబర్ 08 : పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన సిపిఐ మండల కౌన్సిల్ సమావేశానికి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిపిఐ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఖమ్మం బహిరంగ సభ జయప్రదం కోసం హైదరాబాద్ నుండి బస్సు జాతా ప్రారంభమై ఈ నెల 20, 21న యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకుంటున్న సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజానాట్య మండలి కళాకారులు స్వాగతం పలికి బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎర్ర రమేశ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండీ ఇమ్రాన్, మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ, ఏఐటీయూసీ మండల కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, సీనియర్ కామ్రేడ్ బాలగోని మల్లయ్య, ఊట్కూరు భగవంతు, గంగాపురం వెంకటయ్య, ఊట్కూరి కృష్ణ, జగన్నాథం, పెండం రవీందర్, మీసం గాలయ్య, పట్ల నరసింహ, రచ్చ దయాకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

