కొండమల్లేపల్లి, నవంబర్ 08 : మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ అజ్మీరా రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం… డిండి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన జెట్టమోని నరసింహ (55) హైదరాబాద్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. భార్య గెల్వలమ్మ కరోనా సమయంలో మృతి చెందగా, అప్పటినుండి నరసింహ ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తన కొడుకు అంజనేయులు. కోడలు మాధవి తరచు గొడవ పడుతుండడంతో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం సాయంత్రం డ్యూటీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి డ్యూటీకి వెళ్లకుండా కొండమల్లేపల్లికి వచ్చి పశువుల సంతలో శుక్రవారం ఆర్థరాత్రి ఓ రేకుల పందిరికి నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.