Cotton Crop | మనూరు, జులై 05 : వర్షాధార పంట పత్తి పంట సాగుపై అత్యధిక రైతులు మొగ్గు చూపుతున్నారు. గ్రామాల శివారుల్లో ప్రతీ యేటా పత్తి పంట విస్థీర్ణం పెరుగుతూనే వస్తుంది. ఇందుకు ప్రధానంగా రైతులకు కూలీల కొరత లేకుండా ఉండడమే ముఖ్య కారణమని రైతులు చెబుతున్నారు. మనూరు మండల పరిధిలోని అత్యధిక గ్రామాల శివారుల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. మంజీరా పరివాహక గ్రామాలు ఎన్జీ హుక్రాన, అతిమ్యాల్, బాదల్గావ్, పుల్కుర్తి, బెల్లాపూర్, బోరంచ, ముగ్దూంపూర్, రాయిపల్లి, దన్వార్, ఉసిరికెపల్లి తదితర గ్రామాల్లో చెరుకు పంట సాగు ఎక్కువగా ఉన్నపటికి మిగితా గ్రామాల్లో వర్షాధార పంటల సాగు ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా పత్తి పంట పండించేదుకు అనుకూలంగా ఉండడంతో రైతులు మక్కువ చూపుతున్నారు.
పంటల సాగు వివరాలు..
మనూరు మడల పరిధిలోని 2025-25 సంవత్సరానికిగాను పత్తి పంట 24500 ఎకరాలు, పెసర పంట 1200 ఎకరాలు, మినుములు 500 ఎకరాలు, కందులు 1500 ఎకరాలు, సోయా పంట 300 ఎకరాలు సాగు చేస్తున్నట్టు మండల వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆహార పంటల సాగు కంటే రైతులు వాణిజ్య పంటల సాగుకు మొగ్గు చూపడం గమనార్హం. ఆహార పంటల సాగుకు మొగ్గు చూపకపోవడానికి ప్రధాన కారణం అడవిపందుల బెడద ఒకటి. అయితే పంట కోతకు వచ్చిన సమయంలో వర్షాలు కురవడం మరో ఎత్తుగా మారిందని పలు గ్రామాల రైతులు వాపోతున్నారు. పత్తి పంట తీసే సమయానికి పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వస్తుండడంతో కొంత వరకు ఇబ్బందులు లేకుండా పోతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పత్తి పంటకు గిట్టు బాటు ధర కూడా లభిస్తుండడంతో రైతులు పత్తి పంట పాగుకు మొగు చూపుతున్నారు.
ప్రతీ పంట ఆన్లైన్లో నమోదు : మండల వ్యవసాయ అధికారి మహేష్ చౌహన్
సాగు చేసిన ప్రతీ పంట ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది.ప్రతీ సంవత్సరం మాదిరిగా కాకుండా మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో వెల్లి ఏ సర్వే నంబరులో ఏ పంట సాగు చేస్తున్నారని చూసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆన్లైన్ నమోదు చేసిన విధంగానే సీసీఐలో పంటల కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం గ్రామాల్లో ఫార్మర్ రిజిష్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది అది పూర్తి కాగనే పంటల నమోదు ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుంది.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు