న్యూఢిల్లీ : జాతీయ రహదారిపై (National Highway) నిర్దిష్ట అవధిలో ఒక ఏడాదిలో ఒకటి కన్నా ఎక్కువ ప్రమాదాలు (Road Accident) జరిగితే, ఆ రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్‌ను (Contractor) బాధ్యుడిని చేయాలని హైవేల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. నిర్మించు, నిర్వహించు, బదిలీ చేయి (బీఓటీ) విధానంలో నిర్మించిన జాతీయ రహదారులకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.
రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి ఉమా శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, జాతీయ రహదారిపై నిర్దిష్ట అవధి, ఉదాహరణకు 500 మీటర్ల ప్రాంతంలో, ఒక ఏడాదిలో ఒకటి కన్నా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగితే, ఆ రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్‌కు రూ.25 లక్షలు జరిమానా విధిస్తారు. మరో ఏడాది అదే ప్రాంతంలో ఒక ప్రమాదం జరిగితే, జరిమానా రూ.50 లక్షలకు పెరుగుతుంది. దీనికి అనుగుణంగా బీఓటీ అగ్రిమెంట్‌ను సవరించారు.