Surplus Teachers | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటు (Surplus Teachers) ఇంకా కొలిక్కిరావడంలేదు. నెలలు పూర్తవుతున్నా.. విద్యాసంవత్సరం సగానికి సమీపించినా సర్దుబాటు పూర్తికాలేదు. దిద్దుకోలేని తప్పిదాలకు ఈ సర్దుబాటు దారితీసింది. సర్కారు బడుల్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. విద్యార్థులున్నచోట టీచర్లు లేరు.. టీచర్లున్న చోట విద్యార్థుల్లేరు అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ టీచర్ల సర్దుబాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. రాజకీయాలు, ఒత్తిళ్లతో ఈ ప్రక్రి య ముందుకు సాగడంలేదు.
దీంతో శనివారం తాజాగా విద్యాశాఖ త్వరగా పూర్తిచేయాలని మరో ఉత్త ర్వు జారీచేసింది. అధికారిక కథనం ప్రకారం.. రాష్ట్రంలో 8వేల బడు ల్లో 16 వేల మంది మి గులు టీచర్లు ఉన్నట్టు సమాచారం. మరో 3 వేల బడుల్లో 4వేల టీచర్ల అవసరం ఉందని అధికారులు తేల్చా రు. అంటే నవంబర్ ముగిసిన తర్వాత ఇంకా 16వేల మంది మిగులు టీచర్లున్నారు. మరో మూడువేల బడుల్లో టీచర్ల కొరత ఉందంటే ఇంతకాలం సర్దుబాటు ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. అధికారుల నిర్లిప్తత, కలెక్టర్లు దృష్టి సారించకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడంలేదన్న వాదనలున్నాయి. పిల్లలులేక మిగులు టీ చర్లు ఉన్న బడులుండగా, కొన్ని చోట్ల మాత్రం విద్యార్థులున్నా మిగులు టీచర్లు ఉండటం గమనార్హం. ఇలాంటివి చాలానే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిని వీలైనంత త్వరగా సర్దుబాటు చేయాలని ఆదేశాలిచ్చారు.