నల్లగొండ: నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండి ఉండటంతో అధికారులు 14 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌కు 1,66,586క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తంలో వదులుతున్నారు. స్పిల్వేద్వారా 1,12,518 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మిగిలిన మొత్తాన్ని కుడి, ఎడమ కాలువలు, విద్యుత్ ఉత్పత్తి కోసం విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.40 అడుగులకు చేరింది. సాగర్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకుగాను ఇప్పుడు 310.2522 టీఎంసీలు ఉన్నాయి. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.