Lawrence | నటుడు రాఘవ లారెన్స్ గురించి తమిళ, తెలుగు సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటుడిగా కన్నా కూడా సామాజిక సేవలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తాజాగా, శ్వేత అనే దివ్యాంగురాలకి చేసిన సాయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కటిక పేదరికంలో జీవిస్తున్న శ్వేత అనే యువతి, అనారోగ్యం కారణంగా నడవలేని స్థితికి చేరుకుంది. ఆమె పరిస్థితిని తెలుసుకున్న లారెన్స్, మొదట వీల్‌చైర్ స్కూటీ ను బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా, ఆమె నడవడానికి కృత్రిమ కాలును ఏర్పాటు చేయించి, అవసరమైన వైద్య సహాయం అందించారు.
ఇప్పుడు ఆమెకు సొంతంగా ఓ ఇల్లు కట్టించి ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. శ్వేతకు ఓ సురక్షితమైన గృహం అవసరం. ఆమెకు సొంతిల్లు కట్టించడమే నా తదుపరి లక్ష్యం అని లారెన్స్ ప్రకటించారు. ఈ వార్త నెట్టింట్లో వైరల్ కాగా, నెటిజన్లు ‘హ్యాట్సాఫ్ లారెన్స్ అన్నా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్న లారెన్స్, మరోవైపు తన సినిమా ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంచన’ సిరీస్ ఇప్పటికే వరుస హిట్స్ సాధించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో నెక్ట్స్ ఛాప్టర్ ‘కాంచన 4’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ‘కాంచన 4’లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్యపాత్రలో నటిస్తోందట. ఇందులో ఆమె దెయ్యం పాత్రలో కనిపించే అవకాశముంది . లారెన్స్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో, గత సిరీస్‌ల మాదిరిగా హారర్, హ్యూమర్, ఎమోషన్ మిక్స్‌తో పాటు గ్లామర్‌కి పెద్ద పీట వేసినట్టు సమాచారం. కాగా, లారెన్స్ స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, క్యాన్సర్ బాధిత చిన్నారులకు ఉచిత వైద్యం, ఉద్యోగావకాశాలు కల్పిస్తూ, తన సినిమాల్లో ఛాన్స్ వంటివి చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన రైతులకు ట్రాక్టర్లు కూడా బహుమతిగా ఇచ్చారు.
Hi everyone, this is Swetha. Earlier, I was able to support her with leg support for walking. Later, I gifted her a scooty so she could move around independently. Now, I feel building a house for her will truly change her life. She is a girl with a golden heart, and my own heart… pic.twitter.com/vp0KUS1jsZ
— Raghava Lawrence (@offl_Lawrence) September 7, 2025