హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసులకు తెలియకుండా ఛత్తీస్‌గఢ్ పోలీసులు రహస్యంగా మావోయిస్టు శంకర్ అలియాస్ అరుణ్ ఎర్ర మిచాను అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బండేపారాకు చెందిన శంకర్‌పై.. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది.
2023 నవంబర్‌లో కోవర్టు పేరుతో కపేవన్ను హత్య చేయడంతో శంకర్‌పై కేసులు నమోదయ్యాయి. అప్పట్నుంచి శంకర్ అరెస్టుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఈ నెల 4న అదుపులోకి తీసుకున్నారు. అతడికి కోర్టు 4 రోజుల రిమాండ్ విధించింది.