గణేశ్ యాత్రలో కేసీఆర్ పాటల జోష్.. సిరిసిల్లలో పోలీసుల ఆటంకం
వినాయక నిమజ్జనోత్సవంలో కేసీఆర్ పాటల జోష్ కనిపించింది. సారే కావాలంటున్నరే, చల్ దేఖ్లేంగే, గులాబీల జెండలే రామక్క’ పాటలపై యువకులు నృత్యాలు చేశారు.
- యువకుల వాగ్వాదం
సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 7: వినాయక నిమజ్జనోత్సవంలో కేసీఆర్ పాటల జోష్ కనిపించింది. సారే కావాలంటున్నరే, చల్ దేఖ్లేంగే, గులాబీల జెండలే రామక్క’ పాటలపై యువకులు నృత్యాలు చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గణేశ్ నిమజ్జనాలు జరగ్గా, యువతీ యువకులు కేసీఆర్ పాటలపై డాన్స్లు చేశారు. సిరిసిల్లకు చెందిన ఓ దివ్యాంగుడు యువకులతో కలిసి ‘దేఖ్లేంగే’ పాటపై చేసిన నృత్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిమజ్జనోత్సవ యాత్రలో కేసీఆర్ పాటతో వస్తున్న వారిని సిరిసిల్ల మానేరువాగు వద్ద పోలీసులు పాటను ఆపివేయడంతో వాగ్వావాదం జరిగింది. పోలీసులు అంప్లిఫైర్ను తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేసీఆర్ పాట వింటేనే ప్రభుత్వం భయపడిపోతున్నదని యువకులు మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

