Bigg Boss | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఎప్పెడప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ షో సెప్టెంబర్ 7 రాత్రి ఏడు గంటలకి మొదలు కాగా, షో రసవత్తరంగా సాగింది. హోస్ట్ అక్కినేని నాగార్జున తన స్టైలిష్ ఎంట్రీతో సందడి చేశారు. ఓజీ సాంగ్‌తో స్టార్ట్ చేసి, ‘సోనియా సోనియా’ పాటతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరిని హౌజ్‌లోకి ప్రవేశపెట్టారు. మొదటిగా సీరియల్ నటి తనూజ గౌడ్, ఆ తరువాత ఆశా సైనీ హౌస్‌లోకి ప్రవేశించారు. అయితే ఈ సీజన్‌కి ప్రత్యేకత ఏంటంటే – సెలబ్రిటీలతో పాటు కామన్ మాన్లు కూడా హౌస్‌లోకి వచ్చారు. మొత్తం ఆరుగురు కామనర్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా వారిలో మొదటిగా ‘దమ్ము’ శ్రీజ ఎంట్రీ ఇచ్చింది.
వైజాగ్‌కు చెందిన శ్రీజ ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. కానీ బిగ్‌బాస్‌ను ఎంచుకోవడానికి, లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె రీల్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.బిగ్ బాస్ కోసం జాబ్ వదిలేసి హౌజ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ఎలా ఆడుతుందో, ఇతర కంటెస్టెంట్లతో ఎలా మెలుగుతుందో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీజ అభిమానులు మాత్రం, ఆమె తన పేరుకు తగ్గట్టే హౌస్‌లో ‘దమ్ము’ చూపిస్తుందని నమ్ముతున్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ పొందేందుకు నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ ఆడిషన్స్ సమయంలో శ్రీజ తన ప్రత్యేకమైన ప్రవర్తనతో జడ్జిలని ఆశ్చర్యానికి గురి చేసింది. అభిజిత్, బిందు మాధవి ఇద్దరూ ఆమెకు రెడ్ ఫ్లాగ్ ఇచ్చి – “ఈమె అనర్హురాలు” అని అన్నారు. కాని జడ్జ్ నవదీప్ మాత్రం ఆమెకు ఒక అవకాశం ఇస్తూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు, కానీ హోల్డ్‌లో ఉంచారు. ఆ ఒక్క అవకాశాన్ని శ్రీజ వాడుకుంది. అగ్నిపరీక్షలో జరిగిన ప్రతి టాస్క్‌లో ఆమె అత్యుత్తమంగా ప్రదర్శన చూపింది. ఆమె పోరాట పటిమని జడ్జిలు కూడా మెచ్చుకున్నారు. చివరికి ప్రేక్షకుల ఓటింగ్‌లో టాప్‌లో నిలిచి, ఆమె నేరుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ సాధించింది. ఇప్పుడు శ్రీజ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. మిగతా కంటెస్టెంట్ల మధ్య ఆమె ఎలా నిలబడుతుంది? ఆమె ఆట ఎలా ఉంటుంది? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.