నిడమనూరు, అక్టోబర్ 16 : నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఆలంపల్లి మైసయ్య ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలిసిన నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం గురువారం మైసయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట నాయకులు మేరెడ్డి వెంకట రమణ, ఆలంపల్లి ప్రసాద్ ఉన్నారు.